ప్ర‌ముఖ న‌టి క‌న్ను మూత‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-24 03:57:27

ప్ర‌ముఖ న‌టి క‌న్ను మూత‌

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి... గ‌త కొంత కాలంగా సీనియ‌ర్ న‌టీన‌టులు వ‌రుస‌గా క‌న్నుమూస్తున్నారు... అయితే తాజాగా మ‌రో అల‌నాటి హీరోయిన్ క‌న్నుముశారు... గ‌త‌ కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నసీనియ‌ర్ క‌థ‌నాయిక కృష్ణ‌కుమారి బెంగళూరులోని  తన నివాసంలో బుధ‌వారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
 
న‌వ్వితే న‌వ‌ర‌త్నాల చిత్రం ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు ఆమె. ప‌ల్లె ప‌డుచు, బంగారు పాప, ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించారు.  వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డంలో ఈమెకు ఎవ్వ‌రు సాటిలేరు అంటారు.
 
ఎన్టీఆర్‌, ఏఎన్నార్ మిగ‌తా అగ్ర హీరోలు అంద‌రితోను నటించి మెప్పించారు హీరోయిన్ గా తెలుగుచిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఆమె న‌టించిన చిత్రాలు మెజార్టీ హిట్ చిత్రాల వ‌రుస‌లో ఉన్నాయి.... త‌న దైన శైలిలో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఈమె.... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 110 చిత్రాల్లో కృష్ణ‌కుమారి  నటించారు... ప్రముఖ నటి షావుకారు జానకికి కృష్ణకుమారి స్వయానా సోదరి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.