బాహుబ‌లి, దంగ‌ల్ రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టిన పద్మావత్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-27 12:13:55

బాహుబ‌లి, దంగ‌ల్ రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టిన పద్మావత్

వివాదాల న‌డుమ విడుద‌ల అయిన సినిమా పద్మావత్. ఈ వివాదంతో దేశ వ్యాప్తంగా ప‌ద్మావ‌త్ పై స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. గురువారం నాడు విడుద‌లైన ఈ చిత్రం ద‌క్షిణాదిలో అంతగా అద‌ర‌ణ లేకపోయిన ఉత్త‌రాదిన మాత్రం కాసుల వ‌ర్షం కురిపిస్తున్న‌ది. సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలు క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొడుతాయ‌న్న‌ విష‌యం అంద‌రికి తెలిసిందే.

ఇటీవ‌ల రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన బాహుబ‌లి, దంగ‌ల్ సినిమాల‌ను సైతం వెన‌క్కినెట్టింది పద్మావత్ సినిమా. ఓవర్సీస్ లో మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని బాహుబలి-2, దంగల్ రికార్డులను పద్మావత్ బ్రేక్ చేసింది. పద్మావత్ $ 367k లను రాబట్టగా.. బాహుబలి 2 - $ 212k మరియు దంగల్ $ 247k కలెక్షన్స్ ని అందుకున్నాయి. దీంతో పద్మావత్ మొదటి స్థానంలో నిలిచింది.

ఈ సినిమాలో రణ్‌వీర్‌, దీపిక న‌ట‌న‌ సినిమా స్థాయిని పెంచాయి. ఎమోషన్స్ కూడా రియాలిటీగా ఉండడంతో అభిమానులకు తెగ నచ్చేసింది. ఓవర్సీస్ లో చ‌రిత్ర సృష్టించిన పద్మావత్ సినిమా భార‌త‌దేశంలో ఏ స్థాయి రికార్డులు అందుకుంటుందో వేచిచుడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.