నాట‌కాలు ఆడుతోంద‌oటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫైర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-29 12:00:50

నాట‌కాలు ఆడుతోంద‌oటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫైర్

పంజాబీ బ్యూటీ పూన‌మ్ కౌర్ గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు... జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లోరే చ‌లోరే యాత్ర‌లో భాగంగా అనంత‌పురంలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే... అయితే ఈ యాత్ర‌లో ప‌వ‌న్ అధికార తెలుగుదేశం నాయ‌కుల‌ను క‌ల‌వ‌డంతో ప‌లువురు జ‌న‌సేన నేత‌లు మండి పోతున్నారు.

అయితే ఈ క్ర‌మంలో వారితో క‌ల‌వ‌డం ప‌ట్ల న‌టి పూన‌మ్ కౌర్ కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప‌వ‌న్ ను ఉద్దేశించి ప‌రోక్షంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... కేవ‌లం డ‌బ్బుల కోసం మారిపోయిన సిద్దాంతాలంటూ ట్విట్ చేశారు.. అయితే ఈ వ్యాఖ్య‌లు త‌మ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఉద్దేశించి చేశార‌ని, భావిస్తూ పూన‌మ్ పై జ‌న‌సేన అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.

కౌర్ కేవ‌లం ప‌బ్లిసిటి కోసం ఇలాంటి కాంట్ర‌వ‌ర్సీలు సృష్టిస్తోంద‌ని, నాట‌కాలు ఆడుతూ... పేరు చెప్ప‌కుండా ఇలా ఆరోప‌ణ‌లు చేస్తే ఆమెకు రానున్న రోజుల్లో త‌గిన బుద్ది చెబుతామ‌ని ప‌వ‌న్ అభిమానులు రీట్విట్ చేస్తున్నారు.. అయితే మరికొందరు మాత్రం ఆమెకు రీట్విట్ చేస్తూ నిజమే చెప్పిందని కూడా అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.