డాన్స్ మాస్ట‌ర్ జానీకి ప‌వ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-23 05:13:54

డాన్స్ మాస్ట‌ర్ జానీకి ప‌వ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్

ద్రోణ చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన డాన్స్  కొరియోగ్రాఫర్ జాని మాస్ట్‌ర్. త‌న నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్‌లో అగ్ర స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఇండ‌స్ట్రిలో టాప్ హీరోలంద‌రితోనూ ప‌ని చేశారు జాని మాస్ట్‌ర్. ముఖ్యంగా మెగా కుటుంబానికి వీర‌విధేయుడు. చ‌ర‌ణ్ ర‌చ్చ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా ప‌ని చేశారు. జాని ప‌నితీరుని గ‌మ‌నించిన మెగా ప‌వ‌ర్ స్టార్ ఆయ‌న చేసే ప్ర‌తి సినిమాకు కొరియోగ్రాఫర్‌గా అవ‌కాశం క‌ల్పించారు.
 
అయితే జానికి ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం చాలా ఇష్టం. అందుకోసం ఇండ‌స్ట్రికి రాక ముందు ఒక క‌ధ‌ను సిద్దం చేసుకుని పవన్ కి  వినిపించాడట‌. కానీ పవన్ ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయమని సలహా ఇచ్చారు. దీంతో జానీ కొరియోగ్రాఫర్‌గా ప‌ని చేస్తునే  ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం నేర్చుకున్నారు. సుదీర్ఘ‌కాలం త‌రువాత ఆ క‌థ‌ను మార్చి ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వినిపించాడ‌ట జాని. ఈ సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.
 
అయితే సోమ‌వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విలేక‌రుల స‌మావేశంలో మాట్టాడుతూ... ప్ర‌స్తుతానికి  సినిమాలు చేయ‌డం లేదంటూ  షాక్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో   జాని మాస్ట్‌ర్‌తో చేయ‌బొయే సినిమాకు ప‌వ‌న్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.   న‌టీన‌టులుగా మాత్రం  ఎవ‌రైన న‌టించ‌వ‌చ్చు అని స‌మాచారం. మోత్తానికి జాని మాస్ట్‌ర్  బంప‌ర్ అఫ‌ర్ కొట్టేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.