క‌త్తికి ప‌వ‌న్ కౌంట‌ర్లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-24 04:03:50

క‌త్తికి ప‌వ‌న్ కౌంట‌ర్లు

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణాలో రాజ‌కీయ యాత్ర చేస్తున్నారు ఈ యాత్ర‌లో ప‌వ‌న్ అభిమానులు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్ వెంట ఉంటున్నారు.. ఈ యాత్ర‌లో పార్టీకి  సంబంధించిన నిర్మాణాత్మ‌క విష‌యాల గురించి వివ‌రించారు ప‌వన్.. అవినీతి ర‌హిత స‌మాజాన్ని ఎర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీ ప‌ని చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలిపారు.
 
 ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ అభిమానుల‌కు, క‌త్తి మ‌హేష్‌కు మ‌ధ్య జ‌రిగిన వివాదం అంద‌రికీ తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఈ వివాదానికి సామ‌ర‌స్యంగా ముగింపు ప‌లికారు ఇరువురు.... ఇక పై క‌త్తి  మ‌హేష్ పై ఎలాంటి కామెంట్లు పెట్ట‌మ‌ని ప‌వ‌న్ అభిమానులు చెబితే ప‌వ‌న్ పై ఎలాంటి విమ‌ర్శ‌లు  చేయ‌న‌ని  క‌త్తి మ‌హేష్ తెలియ‌చేశారు. దీంతో ఈ వివాదానికి బ్రేక్ ప‌డింది.
 
రాజ‌కీయ  యాత్ర‌లో భాగంగా ప‌వ‌న్ మాట్లాడుతూ, స‌మాజంలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి.. వాటి పై స్పందించకుండా  అన‌వ‌స‌ర వాటి పై స్పందిస్తున్నారు అని ప‌వ‌న్  అన్నారు... ఇలాంటి వారికి స‌మాధానం చేప్పే శ‌క్తి నాకుందంటూ ప‌వ‌న్ అన్నారు.. అయితే ఈ వ్యాఖ్య‌లు ప‌వ‌న్ ప‌రోక్షంగా క‌త్తి మ‌హేష్ పై చేశార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.