సుడిగాలి సుధీర్ జీవిత ర‌హ‌స్యం వింటే షాక్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-29 01:27:00

సుడిగాలి సుధీర్ జీవిత ర‌హ‌స్యం వింటే షాక్

జ‌బ‌ర్ధ‌స్త్ సుడిగాలి సుధీర్ అంటే తెలియ‌ని వారంటూ ఉండ‌రు... ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా 2013 లో త‌న హాస్య న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు సుధీర్... అలా జ‌బ‌ర్ద‌స్త్ షోలో హాస్య న‌టుడిగా ప‌రిచ‌య‌మై, అంచ‌లంచెలుగా ఎదుగుతూ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిర‌స్ధాయిగా నిలిచిపోయాడు సుడిగాలి సుధీర్..... అయితే ప్ర‌స్తుతం బుల్లి తెర‌పైనే కాకుండా, వెండి తెర పై కూడా హాస్య న‌టుడిగా ప‌లు చిత్రాల‌లో న‌టిస్తున్నాడు.

తాజాగా ఓ ఛాన‌ల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో సుధీర్ త‌న జీవిత ర‌హ‌స్యాల‌ను చెప్పారు... తాను గ‌డిపిన జీవితం ఎవ్వ‌రూ గ‌డ‌ప‌కూడ‌ద‌ని, త‌న క‌ష్టం ఎవ్వ‌రికి రాకూడ‌ద‌ని అన్నారు.... సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్ కు రాక ముందు క‌ష్టం త‌ప్ప సుఖం ఎలా ఉంటుందో తెలియ‌ని జీవితాన్ని గ‌డిపాన‌ని తెలిపారు.

ప్ర‌తీ రోజూ మూడు పూట‌ల్లో రెండు పూట‌లు భోజ‌నం లేకుండా ఒట్టి మంచి నీళ్లు తాగి క‌డుపు నింపుకునే వాడిన‌ని చెప్పారు... అలాంటి స‌మ‌యంలో త‌న‌కు త‌న కుటుంబానికి మ్యాజిక్కే అన్నం పెట్టింద‌ని తెలిపారు... అయితే తాను ఎంత ఎత్తు ఎదిగినా కాని మ్యాజిక్, జ‌బ‌ర్ద‌స్త్ రెండు క‌ళ్ల‌ని ఈ రెండు ఎప్ప‌టికి మ‌రిచిపోలేనివ‌ని తెలిపారు.. ఈ నేప‌థ్యంలో సుధీర్ చిన్న‌నాటి ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.