ఆ హీరోతో న‌టించ‌ను అంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-03 04:30:10

ఆ హీరోతో న‌టించ‌ను అంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌

సినిమాల్లో న‌టించాల‌నే  కోరిక చాలా మందికి  ఉంటుంది... ఈ ప్యాష‌న్ తో  అవ‌కాశాల కోసం ఎన్నో విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి తమ‌ న‌ట‌న, అంద చందాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డి పొతుంటారు.. అయితే అవ‌కాశాలు రాని ప‌క్షంలో స్థాయిని త‌గ్గించుకుని చిన్న పాత్ర‌ల‌లో సైతం న‌టించ‌డానికి సిద్దం అవుతుంటారు. అందుకే దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌పెట్టుకోవాలి అనేలా చాలా మంది ముద్దుగుమ్మ‌లు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఫాలో అవుతారు.
 
చిన్న సినిమాతో హిట్ అందుకుని పెద్ద నిర్మాత బ్యాన‌ర్ లో రెండో అవ‌కాశం ద‌క్కించుకుంది ఓ ముద్దుగుమ్మ‌, అయితే ఆ చిత్రం హిట్ టాక్ రావ‌డంతో, ఆమె ఇంటి ముందు క్యూ క‌ట్టారు నిర్మాత‌లు... దీంతో రేంజ్ తో పాటు రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేసింది... అయితే ఇటీవ‌ల ఆమె మూడు సినిమాలతో వ‌రుస‌గా హిట్ అందుకుంది.. దీంతో ఓ సినిమాలో ప్ర‌ముఖ హీరోతో ఆమెకు పొస‌గ‌లేద‌ట‌, దీంతో ప‌లుసార్లు వివాదం అయింద‌ట ఆ హీరోతో.
 
ఇక సినిమా ఎప్పుడు అవుతుందా అని ఆలోచించింద‌ట ఆ ముద్దుగుమ్మ, అయితే తాజాగా అదే హీరోతో మ‌రో నిర్మాత సినిమా చేయాల‌ని ఆశ‌గా ఈ హీరోయిన్ ని క‌థానాయిక‌గా అడిగార‌ట.... హీరో వేరేవారు అయితే చేస్తాన‌ని త‌న‌తో చేయ‌న‌ని ఖ‌రాకండిగా చెప్పింద‌ట ఈ టాప్ హీరోయిన్, దీంతో హీరోను మార్చే ప్ర‌స‌క్తేలేద‌ని మ‌రో బ్యూటీని చూసుకుంటా అని వెనుదిరిగాడ‌ట ఆ నిర్మాత‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.