బాల‌య్య‌కు వైద్య చికిత్స త‌ప్ప‌ని స‌రి లేదంటే...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-31 06:39:41

బాల‌య్య‌కు వైద్య చికిత్స త‌ప్ప‌ని స‌రి లేదంటే...

హిందూపురం ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ.... ఆయ‌న న‌టించిన తాజా చిత్రం జై సింహా... ఈ సినిమా నందమూరి అభిమానుల‌కు  సంక్రాంతి పండుగ కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టిన సంగతి తెలిసిందే...  ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌ త‌న తండ్రి ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని సినిమా తీయ‌నున్నారు... ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
 
    అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బాలయ్య‌ గ‌త ఎనిమిది నెలలుగా భుజం నొప్పితో బాధ ప‌డుతున్న‌ట్లు తెలుస్తొంది... రీసెంట్ గా బాల‌య్య‌ న‌టించిన చిత్రం జై సింహా.... ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో బాల‌య్య భుజానికి పెద్ద గాయ‌మైంద‌ట‌... అయితే బాల‌కృష్ణ గాయాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా షూటింగ్ లో పాల్గొన్నారు. 
 
    ఇప్పుడు ఆ గాయం తీవ్ర‌త బాల‌య్య‌కు ఎక్కువ కావ‌డంతో త‌ప్ప‌ని స‌రి స‌ర్జ‌రి చేయించాల‌న్నారు వైద్యులు... షూటింగ్ స‌మయంలో బాల‌య్య రెస్ట్ తీసుకోకపోవ‌డంతో ఆ గాయం అలాగే ఉంద‌ని స‌ర్జ‌రీ  చేయించుకోక త‌ప్ప‌ద‌ని వైద్యులు తెలుపుతున్నారు... దీంలో పాటు సుమారు నాలుగు నెల‌ల పాటు బెడ్ రెస్ట్ త‌ప్ప‌నిస‌ర‌ని వైద్యులు చెబుతున్నా దానిని బాల‌య్య తిర‌స్క‌రిస్తున్నారు... ఎన్టీఆర్ బయోపిక్‌ని అనుకున్న సమయంలో పూర్తిచేయాలని భావిస్తున్నార‌ని.... అందుకోస‌మే  ఆపరేషన్ ను తిర‌స్క‌రిస్తున్నార‌ని తెలుస్తుంది.                                     

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.