ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతిగా ఆమని

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

lakshmi parvathi and actor amani
Updated:  2018-08-07 15:36:48

ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతిగా ఆమని

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా "ఎన్టీఆర్". నందమూరి తారక రామారావు గారి బయోపిక్ మీద సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఇప్పటికే రానా నారా చంద్రబాబు నాయుడుగా అలాగే బసవతరకంగా విద్య బాలన్ నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇప్పుడు ఈ సినిమాలో మరో అలనాటి హీరోయిన్ ఆమని నటించనుంది. ఈ సినిమాలో ఆమె ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మి పార్వతి పాత్ర పోషించనుంది అంట. ఎన్టీఆర్ ఫ్యామిలీ పూర్తి నెగటివ్ గా ఉండే ఈ పాత్రని సినిమాలో ఎలా చూపిస్తారు అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.

అసలు ఈ సినిమాలో ఆమెని పాజిటివ్ గా చూపిస్తారా లేకపోతె నెగటివ్ గా చూపిస్తారా అనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారాహి చలని చిత్రం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.