పక్షవాతం వల్లే అర‌వింద స్వామికి జుట్టు అంతా ఊడిపోయింద‌ట‌..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor aravinda swamy
Updated:  2018-10-15 03:23:36

పక్షవాతం వల్లే అర‌వింద స్వామికి జుట్టు అంతా ఊడిపోయింద‌ట‌..

కోలీవుడ్ లో అరవింద్ స్వామి స్టార్ హీరో. ఆయన హ్యాండ్సమ్ లుక్స్ ని పడని వారు ఉండరేమో. కెరీర్ మొదట్లో నటించిన రోజా, బొంబాయి లాంటి సినిమాలతో ఆయన రేంజి బాగా పెరిగింది. ఇప్పటికి, ధృవ, నవాబ్ లో చేసింది నెగటివ్ రోల్ అయినప్పటికీ ఆయన క్రేజ్ అలానే పదిలంగా ఉంది. ఇప్పటికీ ఆయన అందానికి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ కొన్నేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నప్పుడు అరవింద్ స్వామి గుర్తు పట్టలేనంత విధంగా తయారయ్యాడు.

జుట్టంతా ఊడిపోయి, బాగా లావయిపోయి, అసలు హీరో అంటే నమ్మలేనట్టు తయారయ్యాడు. అయితే ఇదంతా అరవింద్ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదట. తీవ్ర అనారోగ్యం వల్లనే అలా అయిందట. ఒక దశలో అతడికి పక్షవాతం కూడా వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అరవింద్. 1999లో సఖి సినిమాలో నటించాక కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి వ్యాపారాన్ని చక్కదిద్దారట. ఆ సమయంలో తనకు తీవ్రమైన వెన్ను నొప్పి తో ఆసుపత్రిలో చేరితే మూడు రోజుల తర్వాత బెడ్ మీది నుంచి లేవబోతే, కుడి కాలు కదల్లేదని,  డాక్టర్లు పక్షవాతం వచ్చిందని చెప్పారట.

మందుల ప్రభావం వల్ల మంచానికే పరిమితం అయ్యాడని అందుకే బరువు 110 కిలోలకు చేరిందన్నాడు. ఇవేమీ తెలియకుండా సోషల్ మీడియాలో జనాలు తన పాత, కొత్త ఫొటోలు పెట్టి మీమ్స్ తయారు చేశారని అరవింద్ ఆందోళన వ్యక్తం చేశాడు. మణిరత్నం ‘కడలి’ సినిమా కోసం మళ్లీ పిలిచినప్పుడు, అరవింద్ బరువు తగ్గి మాములు స్థితికి వచ్చాడట.

షేర్ :

Comments

0 Comment