సెక్స్ రాకెట్ పై అర్చ‌న మండిపాటు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-20 17:13:58

సెక్స్ రాకెట్ పై అర్చ‌న మండిపాటు

ఇసుక రేణువంత విష‌యాన్ని ఐరెన్ ఓర్ అంత్ చేస్తాయి ఈ మీడియాలు.. ముఖ్యంగా సెక్స్ రాకెట్ అంశం ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది.. ఇప్పుడు టీవీ ఛాన‌ళ్ల‌కు మ‌సాలాగా ఇది దొరికింది.. ప్రైమ్ టైమ్ లో కూడా ఇదే బులిటెన్ల‌తో హోరెత్తిస్తోంది మీడియా స‌ర్కిల్.. ఇప్ప‌టికే గంట‌ల గంట‌ల ప్రోగ్రామ్స్ తో శాటిలైట్ మీడియా ప్ర‌సారాలు చేస్తోంది..బూతు పంచాయ‌తీ అనేస‌రికి ఈ మీడియాల‌కు ఎందుకు ఇంత ఆశ ప్ర‌యాస అనేది తెలియ‌దు అని చూసేవారు అంటున్నారు. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం పై  కూడా అలాగే చేశాయి హాడావుడి ఈ మీడియాలు..
 
అయితే ఇప్పుడు చికాగో సెక్స్ రాకెట్ అంశం బాగా తెర‌పైకి వ‌చ్చి హైలెట్ అవుతోంది.. ఇప్ప‌టికే అనేక మ‌సాలాల‌తో ఈ క‌థ‌నాల‌కు కొత్త కొత్త రంగులు అద్దుతున్నారు.. ఆడియో టేపులు, వీడియో టేపులు అంటూ వీరే బ్రాండింగ్ చేస్తున్నారు... అక్క‌డ‌కు యాంక‌రింగ్ చేయ‌డానికి వెళ్లిన వారితో అలాగే హోస్టింగ్ చేసిన వారితో హీరోయిన్ల‌ను ఇలా అవకాశం దొరికిన ప్ర‌తీ ఒక్క‌రిని ఫోన్ ఇన్ తీసుకుని వారి ఓపినియ‌న్ తెలుసుకుని మ‌రికొంత మ‌సాలా అద్దుతున్నారు. ఈ స‌మ‌యంలో హీరోయిన్ అర్చ‌న విష‌యంలో ఫోన్ ఇన్ తీసుకుంది ఓ ఛాన‌ల్.
 
ఆమె త‌న ఆవేద‌న చెప్పుకొచ్చింది.. కొంద‌రు చేసే త‌ప్పుకి మొత్తం టాలీవుడ్ ని అన‌డం స‌రికాద‌ని, ఇలాంటివి చేసేవారివ‌ల్ల మొత్తం ఇండ‌స్ట్రీకి చెడ్డ‌పేరు వ‌స్తోంది అని అర్చ‌న కోపం తెచ్చుకుంది.. ఒక‌రిని మ‌నం విక్టిమ్ చేయ‌డం స‌రికాదంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అర్చ‌న‌కు కోపం తెప్పించిన ఆ ఛాన‌ల్ పై ఇప్పుడు నెటిజ‌న్లు కూడా ఫైర్ అవుతున్నారు త‌మ కామెంట్ల తో..
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.