పోలీస్ స్టేషన్ కి అర్జున్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor arjun
Updated:  2018-11-06 03:35:22

పోలీస్ స్టేషన్ కి అర్జున్

విస్మయం చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పకుండానే హీరో అర్జున్ తనను దగ్గరకు లాక్కుని వీపు మీద అసభ్యంగా చేతులతో టచ్ చేశాడు అంటూ శృతి హరిహారన్ చేసిన ఆరోపణ ల నేపథ్యంలో అర్జున్ ని పోలీసులు విచారించారు. శృతి హరిహారన్ మీటూ నేపథ్యంలో అర్జున్ మీద లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా లైంగిక వేదింపుల ఆరోపణల వివాదం తారా స్థాయికి చేరింది. లైంగిక వేదింపులు చేసిన శృతి హరిహరన్ పై అర్జున్ పరువు నష్టం దావా వేసాడు.

దాంతో నొచ్చుకున్న శృతి నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లైంగిక వేదింపుల కేసును నమోదు చేసింది.. బెంగళూరులోని కుబ్బాన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో అర్జున్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. ఎఫ్ ఐ ఆర్ నమోదు అవ్వడంతో పోలీసుల ముందుకు అర్జున్ రాక తప్పలేదు. పోలీసులు అర్జున్ కు విచారణకు సోమవారం హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు పంపిన విషయం తెల్సిందే. అర్జున్, పోలీసుల ఆదేశాల మేరకు విచారణకు హాజరు అయ్యాడు.

విచారణలో భాగంగా కుబ్బాన్ పార్క్ పోలీసులు అడిగిన అన్ని విషయాలకు అర్జున్ సరైన సమాధానాలు ఇచ్చాడని విచారణకు పూర్తిగా సహకరించడంతో పాటు మళ్లీ పిలిచినప్పుడు వచ్చేందుకు కూడా ఓకే చెప్పినట్లుగా పోలీసులు మీడియాతో చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో ఇతర యూనిట్ సభ్యులను కూడా విచారిస్తాం అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. ఒక పక్క అర్జున్ ని పోలీస్ స్టేషన్ వరకు తీస్కొచిన శృతి ని పరిశ్రమ నుండి బ్యాన్ చేయాలంటూ అర్జున్ ఫాన్స్ కోరుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment