ఆ సినిమా నేనే చేస్తా బాల‌య్య క్లారిటీ.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-25 11:48:16

ఆ సినిమా నేనే చేస్తా బాల‌య్య క్లారిటీ.

బాల‌య్య ఏది చేసినా సంచ‌ల‌న‌మే, బాల‌య్య సినిమాలే కాదు రాజ‌కీయాల్లో కూడా ఆయ‌నో క్రేజ్.. తాజాగా సీఎం చంద్రబాబు లేని స‌మ‌యంలో, పైగా ఆయ‌న కుర్చీలో కూర్చొని అధికారుల‌తో రివ్యూ మీటింగ్ ఏర్పాటుచేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
 
తాజాగా త‌న తండ్రి ఎన్టీరామారావు చేయాలి అని అనుకున్న సినిమాలు తాను పూర్తిచేస్తాన‌ని, ఆయ‌న కోరిక తాను నెర‌వేరుస్తా అని నట‌సింహం నంద‌మూరి బాల‌య్య అన్నారు..గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌.
 
రామానుజచార్య సినిమా త్వరలో తాను చేస్తానని ప్రకటించారు బాల‌య్య‌. రామానుజచార్యులు ఆధ్యాత్మిక గురువే కాక గొప్ప సంఘసంస్కర్త అని, వేల సంవత్సరాల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన వ్యక్తి ఓ మ‌హోన్న‌తమైన వ్య‌క్తి అని  ఆయ‌న్ని ప్రశంసించారు. 
 
ఇటీవ‌ల రామానుజచార్యులపై పోస్టల్‌ స్టాంప్ విడుదల చేసినందుకు గానూ  ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు బాల‌కృష్ణ‌

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.