ఆయన అభినందనే నాకో ప్రేమ లేఖ .. నభా నటేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ragavendra rao and nata natesh
Updated:  2018-11-05 12:05:55

ఆయన అభినందనే నాకో ప్రేమ లేఖ .. నభా నటేష్

మొదటి సినిమా టైటిల్ కి న్యాయం చేస్తూ, కుర్రకారు మనసు ని దోచుకున్న కన్నడ భామ నభా నటేష్. ఈ మధ్య కాలంలో మొదటి సినిమా తోనే ఇంత క్రేజ్ సంపాదించుకుని, ఇంత ఆకట్టుకున్నవారు లేరు. అది కేవలం నభా నటేష్ కే చెల్లింది. నన్ను దోచుకుందువటే సినిమా కలెక్షన్స్ పరంగా అంత ఆకట్టుకోకపోయినా, ఈ భామ మాత్రం అందరి దృష్టి ని ఆకట్టుకుంది.

దాంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతులో రెండు, మూడు సినిమా లు ఉన్నాయి. దాంతో సెట్స్ లో బిజీ అయిపోయింది ఈ భామ. తాను తెలుగమ్మాయిని కాకపోయినా.. తెలుగు సినిమాలు చాలా వరకు చూసేదాన్నని అంటోంది. ముఖ్యంగా హీరోయిన్లను చాలా అందంగా చూపించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సినిమాలు అయితే వదలకుండా చూశానని చెప్పింది. ఆయనంటే తనకి చాలా అభిమానమని.. అలాంటి దర్శకుడు నన్ను దోచుకుందువటే విడుదల తర్వాత యూనిట్ మొత్తాన్ని ఇంటికి పిలిచారని చెప్పింది..

ఆ సంగతులు చెప్తూ .. నా గురించి అన్ని విషయాలూ అడిగి తెలుసుకున్నారు. ఇంత బాగా ఎలా నటించావు..? మీ కుటుంబంలో ఎవరైనా నటీనటులు ఉన్నారా అని అడగగా, అలా ఏమీ లేదని.. మా కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తొలి అమ్మాయిని నేనే అని చెబితే మరింతగా అభినందించారు. నాకు ప్రేక్షకుల నుంచి ప్రేమలేఖ లేమీ రాలేదు. అలాంటివి వస్తాయేమో అని ఎదురు చూసా. కానీ రాఘవేంద్రరావు గారి అభినందననే ఒక ప్రేమ లేఖగా  అనుకుంటాను అని చెప్పుకొచ్చింది నభా నటేష్.

షేర్ :

Comments

0 Comment