అలాంటి పాత్రలు గతి లేక చేసాను - పవిత్ర లోకేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor pavithra lokesh
Updated:  2018-08-13 04:21:31

అలాంటి పాత్రలు గతి లేక చేసాను - పవిత్ర లోకేష్

తెలుగులో చాలా పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది పవిత్ర లోకేష్. గత కొన్నేళ్ళ క్రితం హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసిన ఈమెకి ఇప్పటికి చాలా పెద్ద సినిమాల్లో ముఖ్య పాత్రలు లభిస్తున్నాయి. కానీ ఇప్పటికి తన గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది పవిత్ర లోకేష్.

తెలుగు సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందు పవిత్ర లోకేష్ కన్నడ సినిమాల్లో నటించింది. కన్నడంలో అంటే వ్యాంప్ పాత్రలు, చిన్న చిన్న పాత్రలు పోషించింది కానీ తెలుగులో అమ్మ లేక వదిన పాత్రలకు అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది పవిత్ర లోకేష్.

కన్నడ స్టార్ హీరో అంబరీష్ ప్రోత్సాహంతో నేను సినిమాల్లోకి వచ్చానని అయితే ఎత్తుగా, లావుగా ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో హీరోయిన్ పాత్రలు రాలేదని అంటోంది. అయితే ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నానని ఎందుకంటే పలువురు హీరోలకు హీరోయిన్స్ కి తల్లిగా అలాగే కథలో ముఖ్యపాత్రలో నటిస్తుండటంతో వృత్తి పట్ల సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.

షేర్ :