తెలంగాణా స్లాంగ్ తో వస్తున్న రాజ శేఖర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor rajasekhar
Updated:  2018-08-22 03:26:01

తెలంగాణా స్లాంగ్ తో వస్తున్న రాజ శేఖర్

చాలా ఏళ్లు ప్లాప్ సినిమాలతో కొనసాగిన డా.రాజశేఖర్, గత సంవత్సరం వచ్చిన "గరుడ వేగ"తో అనూహ్య విజయం అందుకున్నాడు. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు, దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ లో "విశ్వరూపం"ఫేమ్ అయినా పూజా కుమార్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఆ చిత్ర విజయం తర్వాత ఆచి తూచి కథలను ఎంపిక చేసుకున్న రాజశేఖర్, "ఆ!" చిత్రంతో అనూహ్య విజయం అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తిగా 1983 నేపధ్యం లో జరిగే కథగా తెరకెక్కుతుంది అని సమాచారం. అలాగే ఈ సినిమా మొత్తం తెలంగాణా బాషలోనే ఉండబోతుంది అంట. ఈ సినిమా కోసమే రాజశేఖర్ తెలంగాణా బాష నేర్చుకుంటున్నాడు.

ఇక ఈ చిత్ర టైటిల్ ని ఈ నెల 26న ప్రకటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రంతో పాటు ఎన్టీఆర్ జీవిత కథగా తెరకెక్కుతున్న "ఎన్టీఆర్" చిత్రంలో కూడా రాజశేఖర్ ఒక కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఆయితే ఆయన పోషించే పాత్ర పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దర్శకుడు ప్రసంత్ వర్మ తమన్న తో హిందీ "క్వీన్" రీమేక్ చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కి "దటీజ్ మహాలక్ష్మీ" అనే టైటిల్ ఇటివల ఖరారు చేసారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.