రావు ర‌మేష్ ఇంట‌ విషాదం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rao ramesh mother died
Updated:  2018-04-07 03:57:29

రావు ర‌మేష్ ఇంట‌ విషాదం

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏ పాత్ర చేసినా మెప్పించే న‌టుడు రావు ర‌మేష్..... రావు ర‌మేష్‌కు  చిన్న‌ప్ప‌టి నుంచి న‌ట‌న పై ఆస‌క్తి  ఉండటం వ‌ల్ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి రంగ ప్ర‌వేశం చేశారు. తండ్రి రావు గోపాల్ రావు న‌ట‌నకు దూరం అయినా.. ఆయన తండ్రి స్టైల్ లో త‌న కోణాన్ని న‌ట‌న‌లో చూపుతూ ప‌లువురు అభిమానుల‌ను సంపాదించుకున్నారు రావు ర‌మేష్. తాజాగా రావు ర‌మేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
 
రావు ర‌మేష్ త‌ల్లి ప్రముఖ హరికథా కళాకారిణి, ప్రముఖ నటులు రావు గోపాల్‌ రావు భార్య కమల కుమారి (73) ఆరోగ్య సమస్యల రిత్యా ఇవాళ‌ కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో సహాయ నటుడిగా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్నో వేదికలపై హరికథా గానం చేసిన కమల కుమార్ రావు గోపాల్‌ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమె. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొండాపూర్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.