హీరోయిన్ లు ఎక్కువ చేస్తే అది క‌ట్ చేస్తా....

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-13 03:35:20

హీరోయిన్ లు ఎక్కువ చేస్తే అది క‌ట్ చేస్తా....

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొద్ది కాలంగా ద‌క్షిణాది హీరోయిన్ ల హ‌వా ఏ రేంజ్ లో కొనసాగుతోందో మ‌నంద‌రికీ తెలిసిందే... మెద‌ట్లో చిన్న‌హీరోల సినిమాల‌కు  స‌ర‌స‌న చేసిన ఈ వయ్యారి భామ‌లు, ప్ర‌స్తుతం స్టార్ హీరోల  సినిమాల‌లో న‌టించే అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నారు... అలా అవ‌కాశాలు ద‌క్కించుకున్నాకా ఏదైనా వెండితెర‌కు సంబ‌ధించి కార్యక్ర‌మం ఏర్పాటు చేస్తే, అసోసియేష‌న్  త‌రుపున హీరోయిన్ ల‌కు ఆహ్వానం పంపితే వారు  ఆ ఆ కార్య‌క్ర‌మానికి   కోట్ల‌రూపాయ‌ల‌ రెమ్యున‌రెష‌న్ తీసుకుంటున్నారు.
 
అయితే ఇదే విష‌యంపై !!మా!! సంస్థ అధ్య‌క్షుడు శివాజీ రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.. తాము స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ఏదైనా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తే ప్ర‌తీ హీరో హాజ‌రవుతార‌ని... కానీ హీరోయిన్స్ ను బ్ర‌తిమిలాడినా  స‌హ‌క‌రించ‌డం లేద‌ని శివాజీ మండిప‌డ్డారు... 
 
తాము అమ్మా! అమ్మా అని బ్ర‌తిమిలాడితే ఇద్దరు లేక‌ ముగ్గురు మాత్ర‌మే స‌హ‌క‌రిస్తున్నార‌ని, మిగిలిన హీరోయిన్ లు డబ్బులిస్తేగాని కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కామంటున్నార‌ని శివాజీ అన్నారు.. తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి కోట్ల రూపాయ‌లు సంపాదించుకుంటున్న హీరోయిన్ లు ఎప్పుడైనా సినీ ప‌రిశ్ర‌మ‌కు  సాయం చేయ‌ల్సి వ‌చ్చిన‌ప్పుడు స‌హ‌క‌రించకున్నార‌ని   శివాజీ మండిప‌డ్డారు.
 
నిర్మాత‌లు చెక్ లు ఇస్తామ‌న్న‌ప్పుడు ప‌రిగెత్తుకుంటూ వెళ్తార‌ని అన్నారు... వీరితో పాటు వీరి మెనేజ‌ర్లు కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కోన్నారు...ఇక నుంచి ఏ హీరోయిన్ అయినా తోక జాడిస్తే వారి తోక క‌ట్ చేస్తామంటూ వ్యాఖ్య‌లు చేశారు శివాజీ ... మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇచ్చేంత డబ్బు ఇవ్వలేకపోయినా, తాము కూడా ఎంతో కొంత ఇస్తామని 'మా' కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.