మాధురి దీక్షిత్ మేకప్ మ్యాన్ ముద్దు పెట్టుకోబోయాడట..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine madhuri dixit
Updated:  2018-10-17 06:11:32

మాధురి దీక్షిత్ మేకప్ మ్యాన్ ముద్దు పెట్టుకోబోయాడట..

రానురాను మీ టూ ఉద్యమం ఊపండుకుంటోంది. ఒకరి తరువాత ఒకరు ధైర్యంగా బయటకి వచ్చి వారిపై జరిగిన వేధింపులను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల వయసులో తనని అసభ్యంగా తాకాలని చూశారని, 14 ఏళ్ల వయసులోనే రేప్ చేశారని చెప్పి తన జీవితంలో ఎందరో మగ మృగాలను ఎదుర్కొన్నానని చెబుతోంది పాకిస్తానీ నటి సోమి ఆలీ.

హిందీ ట్యూటర్ నుండి మేకప్ మేన్ దాకా చాలా మంది అడ్వాంటేజ్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది సోమి. ఈమె ఒకప్పుడు సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించింది. తనతో కలిసి సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్ లో నటించేప్పుడు ఆందోళన్ దర్శకుడు తనను వేధించాడని ఆరోపించింది. అలాగే ఓసారి మేకప్మేన్ తన పెదవుల్ని తడిమి చాలా బావున్నాయని ముద్దు పెట్టుకోబోతుంటే, పక్క రూమ్లో ఉన్న నాన్నగారు రావడంతో తప్పించుకుని గట్టెక్కానని తెలిపింది.

తాజాగా మీటూ ఇండియా ఉద్యమం నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల కిందట తన జీవితంలో ఎదురైన ఎన్నో చేదు అనుభవాలు సోమి అలీ గుర్తు చేసుకున్నారు. తనను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించిన ఆ మేకప్ మ్యాన్ మాధురి ధీక్షిత్ పర్సనల్ మేకప్ మేన్ అని, ఆ ట్యూటర్ పేరు గౌతమ్ అంటూ సోమి రివీల్ చేసింది.

షేర్ :

Comments

0 Comment