దెయ్యం వేషం వేసిన నటి సురేఖ వాణి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor surekha vani
Updated:  2018-11-02 12:31:41

దెయ్యం వేషం వేసిన నటి సురేఖ వాణి

సురేఖ వాణి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. దశాబ్ద కాలం గా పెద్ద బడ్జెట్ సినిమాలలో అక్క, వదిన, ఇతరేతర పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యంది సురేఖ. అయితే సురేఖ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

ఆ మధ్య సురేఖ తన కూతురితో డాన్స్ చేస్తూ ఉన్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజా గా సురేఖ ఒక ఫోటో అప్లోడ్ చేసింది తన సోషల్ మీడియా అకౌంట్ లో. ట్విటర్ వేదిక గా పంచుకున్న ఈ ఫోటోకి హాలోవీన్ అని కాప్షన్ పెట్టింది.గత ఈ ఫొటోలో తెల్లని డ్రెస్ తో, కళ్ళు ఉండే చోట సాలి గూడి లాంటి మేక్అప్ తో, ముక్కెర తో అచ్చం దయ్యం లా భయంకరంగా రెడి అయింది సురేఖ వాణి.

సినిమాల్లో చాలా ట్రెడిషనల్ గా కనిపించే సురేఖ, ఈ ఫోటో అప్లోడ్ చేయడంతో ఈ ఫొటో కింద అందమైన దయ్యం, దయ్యాలు ఇంత అందంగా ఉంటే ఎంత బాగుణ్ణు, రియల్ డెవిల్, అని కుర్రకారు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి టాలీవుడ్ లో చాలా మంది యాక్టర్లు ఇలా డిఫరెంట్ వేషాలు వేసుకొని హాలోవీన్ అంటూ తమ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ సందడి చేస్తున్నారు.

షేర్ :