ఆడిషన్స్ పాస్ అయినా అందుకే రిజెక్ట్ చేసాడు.. స్వర భాస్కర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor swara bhaskar
Updated:  2018-10-29 01:27:59

ఆడిషన్స్ పాస్ అయినా అందుకే రిజెక్ట్ చేసాడు.. స్వర భాస్కర్

సినీ పరిశ్రమలో ఎవర్ని కదిపినా ప్రస్తుతం చర్చకు వస్తున్న విషయం మీటూ.పొరపాటున సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ని ఫేస్ చేసిన,షూటింగ్స్ లో మీడియా వారికి ఇంటర్వ్యూ ఇచ్చిన కామన్ గా అడిగే ప్రశ్నగా మీటూ ఉద్యమం మారిపోయింది. నార్త్ నుండి సౌత్ కూడా పాకి పెద్ద సంచలనాలకు తెర లేపుతుంది ఈ ఉద్యమం. ఆరోపణలు చేసే వారికి ఎం సాదించిపెడుతుందో తెలీదు కానీ, సెలెబ్రిటీ అని ఫీల్ అయ్యే వాళ్ళ బ్రతుకులు బజారున పడుతుంటే, అసలు అందరూ మర్చిపోయిన మొహాలు మళ్ళీ సెలెబ్రిటీ రంగు పులుముకుంటున్నాయి.

నిజ జీవితంలో కూడా జెంటిల్ మెన్ గా పేరున్న యాక్షన్ కింగ్ అర్జున్ 150  సినిమాల తర్వాత కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ఇదిలా ఉంచితే బోల్డ్ కంటెంట్ ఉన్న  సినిమాలు చేయడం తో పాటు హాట్ బ్యూటీగా పేరున్న స్వర భాస్కర్ తనకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ ఆసక్తికరమైన సంఘటనను మీడియా తో పంచుకుంది. తన కొత్త సినిమా షేమ్ ముంబై ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్న సందర్భంతో డిజిటల్ మీడియాతో తన అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశంతో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఓ దర్శకుడు స్వర భాస్కర్ ని ఆడిషన్ కోసం పిలిచాడట. టెస్ట్ లో పాస్ అయినప్పటికీ అతను స్వరను రిజెక్ట్ చేసాడట. కారణం కూడా అతనే చెప్పాడట.

అందంగా ఉన్నా చాలా ఇంటెలిజెంట్ గా స్వర భాస్కర్ కనిపించడం వల్ల సినిమాకు తీసుకోలేనని చెప్పాడట. అంటే అమాయకంగా ఉండే హీరోయిన్ అయితే చెప్పినట్టు వింటుంది, అవసరమైతే గెస్ట్ హౌస్ కైనా వస్తుంది అనే ఉద్దేశం కాబోలు అని ఈ భామ చెప్పుకొచ్చింది.అందరూ ధైర్యంగా ముందువస్తే సినిమా ఆడాళ్ళ అమాయకత్వాన్ని తమ లైంగిక  వాంఛల కోసం వాడుకుంటున్న  వాళ్ళ ఆట కట్టించొచ్చు అని ధైర్యం చెప్తుంది ఈ భామ. వీర్ దే వెడ్డింగ్ హిట్ తో ఊపు లో ఉన్న స్వర భాస్కర్ ఇకపై వరసగా సినిమాలపై దృష్టి పెడతా అని చెప్పింది.

షేర్ :

Comments

0 Comment