ప్ర‌ముఖ తెలుగు న‌టుడు మృతి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor vankayala sathya narayana image
Updated:  2018-03-12 04:57:12

ప్ర‌ముఖ తెలుగు న‌టుడు మృతి

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ ఖ్యాతి పెంచిన న‌టీన‌టులు ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా అసువులు బాసుతున్న తీరు ప‌రిశ్ర‌మ‌ను, అభిమానుల‌ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇటీవ‌ల వెండితెర‌ను యేలిన అందాల న‌టి శ్రీదేవి , హ‌స్య‌న‌టుడు గుండు హ‌నుమంత‌రావు  మృతితో ఆవేద‌న‌లో ఉంది టాలీవుడ్‌. తాజాగా మ‌రో సీనియ‌ర్ న‌టుడు తుది శ్వాస విడిచారు.
 
కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి గ‌త రాత్రి మరణించారు. ఆయ‌న టాలీవుడ్‌లో 180కి పైగా సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు. సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వంకాయల సత్యనారాయణమూర్తి. ఆయ‌న‌ సీతామహాలక్ష్మి, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, విజేత వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. వంకాయల సత్యనారాయణమూర్తికి  ఇద్దరు కుమార్తెలు.. ఆయ‌న మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.