మరో నూతన దర్శకుడితో శేష్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero adivi sesh
Updated:  2018-08-09 05:09:10

మరో నూతన దర్శకుడితో శేష్ సినిమా

"క్షణం" సినిమాతో విలక్షణమైన కథ, కథనం రాయడమే కాకుండా ఆ చిత్రంలో నటించి ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించారు అడివి శేష్, అయితే తాజాగా "గూఢచారి" చిత్రంతో మరోసారి అటు నటుడిగా ఇటు కకుడిగా మరోమారు ప్రేక్షకుల హృదయాలను కొల్లకొట్టాడు అడివి శేష్. 
 
అతి తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ మూవీగా తెరకెక్కిన "గూఢచారి" మంచి వసుళ్లను రాబట్టింది. దీంతో అడివి శేష్ తో సినిమా చేసేందుకు నిర్మతలు అసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా "క్షణం" నిర్మాణ సంస్థ పీవీపీ పిక్చర్స్ తాజాగా అడివి శేష్ తో ఒక చిత్రం చేసేందుకు ముందుకొచ్చింది.
 
పూర్తి స్థాయి థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రాంజీ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు ప్రస్తుతం కథ చర్చలో ఉన్న ఈ చిత్ర వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం వెంకట్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్న "2 స్టేట్స్" రీమేక్ లో నటిస్తున్నాడు అడివి శేష్.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.