రెండో సినిమా ఎవరితో?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero adivi sesh
Updated:  2018-08-10 12:37:07

రెండో సినిమా ఎవరితో?

అడివి శేష్ తాజా చిత్రం "గూఢచారి" ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడతోంది. ముఖ్యంగా స్పై థ్రిల్లర్ నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు శశి కిరణ్ కు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నట్లు కనిపిస్తుంది.

ముఖ్యంగా తన తొలి సినిమాకే గ్రిప్పింగ్ తరహాలో  శశి కిరణ్ కథను నడిపించిన తీరు మన టాలివుడ్ లో చాలా మందికి నచ్చింది, దీంతో ఆతనితో పనిచేసేందుకు యువ కధనాయకులంతా ఆసక్తి కనబరుస్తూన్నట్టు సమాచారం.

దీనికి అనుగుణంగానే శశి కూడా పెద్ద హీరోల కోసం కధలు రాసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా అడివి శేష్ తో "గూఢచారి"కి సిక్వెల్ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నట్లు సమాచారం, మరి తన రెండో చిత్రం శశి ఎవరితో చేస్తాడో అనేది త్వరలోనే తెలుస్తుందని ఆశిద్దాం. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.