అప్పుడు యాడ్ గ‌ర్ల్ ఇప్పుడు సినిమా హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

airtel 4g add girl
Updated:  2018-06-26 12:03:55

అప్పుడు యాడ్ గ‌ర్ల్ ఇప్పుడు సినిమా హీరోయిన్

మొబైల్ యాడ్స్ - నెట్ వ‌ర్క్ యాడ్స్, వ‌చ్చిన త‌ర్వాత  పలు ట్రెండ్ లు సృష్టించాయి అనే చెప్పాలి మార్కెట్లో.. కొత్తధ‌నంలో యాడ్స్ ని డిజైన్ చేశాయి కంపెనీలు, అప్ప‌టి వ‌ర‌కూ స‌బ్బులు పేస్టులకు యాడ్స్ ఇచ్చిన సంస్ద‌లు టెక్నాల‌జీ వైపు స‌రికొత్త ఒర‌వ‌డితో ప‌రుగులు పెట్టాయి.. అయితే హ‌చ్ యాడ్,త‌ర్వాత వొడా కార్టూన్స్ యాడ్స్ కూడా అంతే ఫేమ‌స్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఎయిర్ టెల్ యాడ్ మంచి ఫామ్ లో ఉంది, ఆఫ‌ర్ల‌కు త‌గ్గట్టు యాడ్ ని కూడా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు యాడ్ టీం.
 
ఇక ఫోర్ జీ వ‌చ్చిన త‌ర్వాత టెలికాం కంపెనీలు యాడ్స్ పై ప్ర‌మోష‌న్స్ పై మ‌రింత దృష్టి పెట్టాయి. మ‌నం అంద‌రికి  ఎయిర్ టెల్ యాడ్ సుప‌రిచిత‌మే, చాలెంజింగ్ తో ఈ యాడ్ ని కొత్త‌గా రూపొందిచారు.. స‌షా చెత్రి అనే అమ్మాయి ఈ యాడ్ ను అద‌ర‌గొట్టేలా చేసి ప‌లువురి ప్ర‌శంస‌లు పొందింది.. ముఖ్యంగా టెలికాం రంగంలో ఆమెని ముద్దుగా ఫోర్ జీ గ‌ర్ల్ గా పిలుచుకున్నారు ఈ  యాడ్ వ‌చ్చిన త‌ర్వాత‌.
 
అయితే ముంబైలో అనేక మంది క్యాలెండ‌ర్ల‌కు ఫోటో షూట్లు ఇచ్చి, క‌వ‌ర్ పేజీల పై ఫోటోలు వ‌చ్చిన త‌ర్వాత హీరోయిన్లుగా వెలుగు వెలిగిన వారు ఎందోరో ఉన్నారు.. ఇప్పుడు ఈ ఎయిర్ టెల్ యాడ్ చేసిన ఫోర్ జీ గ‌ర్ల్.. సినిమాలో హీరోయిన్ గా అవకాశం సంపాదించుకుందట ఈ విషయాన్ని ఆమె స్వ‌యంగా చెప్పింది. తన‌కు సినిమా అవ‌కాశం వ‌చ్చింద‌ని ఓ ఇంట‌ర్యూలో తెలిపింది ఈ యాడ్ గ‌ర్ల్, అయితే ఈ సినిమాలో ఒక్క రూపాయి కూడా రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట‌. ఈ సినిమాని అడ‌వి కిర‌ణ్ తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిపింది.
 
ఇక తాను ఎంచుకున్న స్ట్రీమ్ యాడ్ అయితే, అక్క‌డ నుంచి తాను ఇలా సినిమాల వైపుకి వ‌చ్చాను అని తెలిపింది ఈ భామ‌.. అయితే చాలా సంద‌ర్బాల‌లో యాడ్స్ త‌క్కువ కాలం ప్ర‌మోట్ అవుతాయి కాని, ఎయిర్ టెల్ ఫోర్ జీ యాడ్ చాలా రోజులు దేశం అంతా ప్ర‌సారం అయింది. దీంతో త‌న‌కు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం వ‌చ్చింది అని చెబుతోంది ఈ కొత్త హీరోయిన్.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.