డైరెక్టర్ కాబోతున్న స్టార్ హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

movie
Updated:  2018-08-04 11:53:44

డైరెక్టర్ కాబోతున్న స్టార్ హీరోయిన్

ప్రపంచవ్యాప్తంగానే ఎంతో మంది అభిమానాన్ని అందుకున్న తార ఐశ్వర్య రాయ్, ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్న గాని ఇప్పటికి వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ట్రాక్ లో దూసుకొని పోతుంది ఐశ్వర్య రాయ్. ఇదిలా ఉంటే ఇటివలే ఈ భామ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనసులోని కోరికని బయట పెట్టింది.

అదేంటంటే త్వరలో ఐశ్వర్య రాయ్ ఒక సినిమాని డైరెక్ట్ చేయనుంది అంట. ఈ విషయానికి వాళ్ళ ఆయన ఇంకా హీరో అయిన అభిషేక్ బచ్చన్ కూడా ఓకే చెప్పారు అని చెప్తుంది ఐష్. అంతేకాకుండా, తాను హీరోయిన్ గా నే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పేరును సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తుంది.

తనకి ఎప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలి అనే ఆశ ఉంది అని కాకపొతే అప్పుడు టైం కలిసి రాలేదు ఇప్పుడు టైం కలిసి వచ్చింది అందుకే దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ఐష్. ఈ 44 ఏళ్ళ సుందరి ఇప్పుడు హీరోయిన్ తో పాటు డైరెక్టర్ గా కూడా సినిమా ఇండస్ట్రీ లో ఎదగాలని అనుకుంటుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.