మీటు ఉద్య‌మంలో చేరి ఐశ్వ‌ర్య సంచ‌ల‌న కామెంట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-11 05:00:00

మీటు ఉద్య‌మంలో చేరి ఐశ్వ‌ర్య సంచ‌ల‌న కామెంట్

బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. స్వర భాస్కర్, తనుశ్రీ దత్తా, వింటా నంద లాంటి చాలా మంది ఇప్పటికే ఈ ఉద్యమంలో చేరి వారి చేదు అనుభవాలు పంచుకున్నారు. ఇక ఈమధ్యనే ఈ ఉద్యమాన్ని సపోర్ట్ పలుకుతూ ముందుకొచ్చింది ఐశ్వర్య రాయ్.  ప్రపంచంలో ఏదో ఒక మూల మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని, అవి బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం చాలాఉందని, అందరూ ప్రత్యేకంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ విషయాలను తెలుసుకుంటే అదే చాలని అంటోంది. 
 
అలాంటి వారు గళం విప్పడానికి సోషల్ మీడియా పనికివస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మీటూ ఉద్యమం మరింత పెద్దది కావాలని, అప్పుడే ఇలాంటి లైంగిక వేధింపులు కొంతవరకైనా తగ్గుతాయని చెప్పింది ఐష్. అయితే గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమ వ్యవహారం గురించి వారి బ్రేకప్ గురించి 2002 లోనే కుండబడ్డలయ్యేలా నిజాలను బయటపెట్టింది.
 
సల్మాన్ ఖాన్ తనను బాగా వేధించేవాడని, కొట్టేవాడని అదృష్టవశాత్తు దెబ్బలు బయటకి కనపడేవి కాదని, తాను మాత్రం ఎప్పటిలాగానే మళ్ళీ ఏమి కానట్టు షూటింగ్ కు వెళ్లిపోయేదాన్ని అని చెప్పింది. బ్రేకప్ అయ్యాక కూడా అప్పుడప్పుడు తాగి కాల్ చేసి వాడని చెప్పి అందరిని ఆశ్చర్య పడేలా చేసింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.