ప‌వ‌న్ నిజాయతీ లేని నా ..... అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-30 06:00:35

ప‌వ‌న్ నిజాయతీ లేని నా ..... అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సినీ న‌టీ న‌టులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటున్నారు... ఈ నేప‌థ్యంలో కొంత‌ కాలంగా జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఆయ‌న అభిమానుల‌ను టార్గెట్ చేస్తూ సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ త‌మ‌ధైన శైలిలో వారిపై విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా చిత్ర పరిశ్ర‌కు చెందిన మ‌రో ద‌ర్శ‌కుడు !! ఎన్ హెచ్ 47 బూత్ బంగ్లా!! సినిమా ఆడియో వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు...ఉమ్మ‌డి తెలుగు ప్రాంతాలు రెండు రా|ష్ట్రాలు గా విడిపోక ముందు... కేసీఆర్ ని తాట తీస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్... విభ‌జ‌న త‌ర్వాత ఆయన చెంత‌ చేరార‌ని ద‌ర్శ‌కుడు అజ‌య్ కౌండిన్యా అన్నారు.

అందులో భాగంగానే చిన్న సినిమాల‌ను తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీలో రిలీజ్ చేయాలంటే చాలా క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని కౌండిన్యా తెలిపారు..అయితే ప్ర‌శ్నించ‌డానికే జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్... ఇండ‌స్ట్రీలోనే అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ముందు వాటిపై స్పందించాల‌ని ద‌ర్శ‌కుడు ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల‌లో సుమారు 1400 ధియేట‌ర్లు ఉన్నాయ‌ని, ఇవ‌న్ని ఓ బ‌డా ప్రోడ్యూస‌ర్ చేతిలో ఉన్నాయ‌ని, చిన్న సినిమాలు విడుద‌ల చేయాలంటే ఆ ప్రొడ్యూస‌ర్ అడ్డుకుంటున్నార‌ని అన్నారు... వీటిపై స్పందించ‌లేని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌పంచానికి ఏం న్యాయం చేస్తార‌ని ప్ర‌శ్నించారు.. అయితే త‌మ స‌మ‌స్య‌ల‌ను తామే ప‌రిష్క‌రించుకుంటామ‌ని ఇందులో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎక్కువ మాట్లాడితే బాగుండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.