అజిత్ ఫ్యాన్స్ కోపానికి గురి అయిన దర్శకుడు శివ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ajith
Updated:  2018-11-05 05:47:43

అజిత్ ఫ్యాన్స్ కోపానికి గురి అయిన దర్శకుడు శివ

తల అజిత్ కి వీరమ్,వేదలమ్ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శివ అందరికి పరిచయమే. కానీ అజిత్ లో మూడో సినిమా అయిన వివేకమ్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీనితో అజిత్ ఫ్యాన్స్ శివ పై విరుచుకుపడ్డారు. అయితే అజిత్ తరువాత సినిమా కూడా శివ ఏ డైరెక్ట్ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ మధ్య రిలీజ్ చేశారు. అది కూడా అంత సంతృప్తికరంగా లేకపోవడం తో డైరెక్టర్ శివ ని అజిత్ ఫాన్స్ బూతులు తిడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. ఆ నాల్గవ చిత్రానికి విశ్వాసం అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఈ చిత్రం 2019 జనవరిలో రిలీజ్ కానుంది అని ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ అంతగా నచ్చకపోవడంతో ఫాన్స్ మాత్రం అసహనానికి గురి అయ్యారు. వివేకమ్ లానే ఇది కూడా ప్లాప్ అవ్వనుందా అని భయపడుతున్నారు. తమిళ్ చిత్ర పరిశ్రమ లో రజినీకాంత్ తరువాత అంతటి క్రేజ్ ఉన్న హీరోలు అజిత్, విజయ్ మాత్రమే.. ఒక పక్క విజయ్, వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో అజిత్ ఒక్క ప్లాప్ పడిన రేసులో వెనకబడిపోతాడు అనేది ఫ్యాన్స్ భావన కావొచ్చు.

శివ-అజిత్ కాంబినేషన్ లో మూడు సినిమాలు గాను, రెండు హిట్లు, ఒకటి ప్లాప్.. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆలోచనలు అటు ఇటుగా ఉన్నాయి. ఒకపక్క భారీ బడ్జెట్ తో విజయ్, మురగదాస్ దర్శకత్వంలో సర్కార్ తో రానున్నాడు. ఈ సినిమా హిట్ అయ్యి, అజిత్ సినిమా ఏ మాత్రం తేడా చేసినా దర్శకుడు శివ, అజిత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు.

షేర్ :

Comments

0 Comment