అఖిన్ ని ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akhil akkineni
Updated:  2018-09-28 03:27:47

అఖిన్ ని ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు..?

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాను బాలీవుడ్ ‘బచ్నా ఏ హసీనో’ అనే మూవీ నుంచి కాపీ కొడుతున్నారనే సంగతి సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది. రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొనె, బిపాసా బసు నటించిన సినిమాని అటు ఇటు తిప్పి ‘మిస్టర్ మజ్ను’ కథని ప్రిపేర్ చేసారని యూట్యూబ్ తంబునైల్స్ ఊపందుకున్నాయి.
 
మొదటి సినిమా దారుణమైన పరాజయాన్ని ఇవ్వగా రెండవ సినిమాతో దర్శకుడి దయవల్ల పర్లేదనిపించుకుని ఇప్పుడు మూడవ సినిమాతో తనాని తాను గట్టిగా నిరూపించుకోవాలనే ప్రయతం లో ఉన్నాడు అఖిల్. ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పుడు వస్తున్న చిత్రం "మిస్టర్ మజ్ను" కాపీ అని ఆడిపోసుకుంటున్నారు నెటిజన్లు.
 
కానీ దర్శకుడు మాత్రం ఇది ఏ సినిమా నుంచి స్టోరీని కాపీ పేస్ట్ చేయలేదని.. ఇది హండ్రెడ్ పర్సంట్ జెన్యూన్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని నమ్మకంగా చెపుతున్నారు.తన కెరీర్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’పైనే హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్ ఇప్పుడు ఇది కూడా కాపీ అని రూమర్స్ రావడంతో..ఈ మ్యాటర్ తెగ టెన్షన్ పెడుతోందట. దర్శకుడు చెప్పేమాటల్లో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వైట్ చెయ్యాలి మరి.!!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.