అఖిల్ కి ఆ డైరెక్టర్ కి గొడవేంటి ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:37:23

అఖిల్ కి ఆ డైరెక్టర్ కి గొడవేంటి ?

అక్కినేని అఖిల్ "అఖిల్" సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచిన తరువాత విక్రం కె కుమార్ తో "హలో" అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా అందరి నోట నుంచి బాగుంది అనే టాక్ తెచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు.

అయితే ప్రస్తుతం వెంకీ అట్లూరి తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలన్న ఉత్సాహంతో అఖిల్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఆ కారణంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ సరిగ్గా జరగడం లేదని టాక్.

అఖిల్ లొకేషన్ లోకి వచ్చాక స్క్రిప్ట్ లో అలాగే దర్శకత్వంలో వేలు పెట్టడం వెంకీ కి నచ్చట్లేదు అంట.అఖిల్ ఇలా చెయ్యడం మూలన ఒక్కో సీన్ ని రెండేసి సార్లు చేయాల్సి వస్తుంది అంట డైరెక్టర్. ఈ విషయాన్నీ డైరెక్టర్ వెంకీ ప్రొడ్యూసర్ వరకు తీసుకొని వెళ్ళాడు అంట. మరి వీళ్ళిద్దరి మధ్య వస్తున్న ఈ క్రియేటివ్ డిఫరెన్స్ సినిమాకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.