అఖిల్ కొత్త గెట‌ప్ స‌క్సెస్ మంత్రం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akhil akkineni
Updated:  2018-06-21 11:41:22

అఖిల్ కొత్త గెట‌ప్ స‌క్సెస్ మంత్రం

అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య త‌ర్వాత, సినిమాల్లోకి అరంగేట్రం చేసిన అఖిల్ త‌న పేరుతోనే మొద‌టి సినిమా తీసి ప్లాఫ్ మూట‌గ‌ట్టుకున్నారు.. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సినిమా తెర‌కెక్కినా ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ కాలేక‌పోయింది.. త‌ర్వాత ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని సినిమా ఎంచుకున్నా అఖిల్ కు అనుకున్నంత స‌క్సెస్ మాత్రం రాలేదు.
 
అయితే ఇటు నాగార్జున కూడా అఖిల్ స్టోరీపై కాస్త శ్ర‌ద్ద పెడుతున్నారు... ఇక హాలో సినిమా అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు.. కాని హిట్ టాక్ తెచ్చుకుంది.. అఖిల్ న‌ట‌న‌కు మ‌రో తార్కాణంగా నిలిచింది.. అఖిల్ కు త‌న రెండు సినిమాల్లో హ‌లో కాస్త ప‌ర్వాలేదు అనిపించుకుంది.
 
ఇక అఖిల్ హ‌లో త‌ర్వాత ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ను తీసుకుంటున్నారు.. అయితే ఆయ‌న మూడో ప్ర‌య‌త్నం కూడా స‌క్సెస్ పుల్  డైరెక్ట‌ర్ తో చేస్తున్నారు.తొలిప్రేమ‌తో తొలి హృద‌య‌పు మ‌దురిమ‌ల‌ను ప్రేమికుల‌కు యువ‌త‌కు గుర్తు చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రానుంది.. ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు.ఇక మ‌రో వారంలో ఈ సినిమా తొలి షెడ్యూల్ జ‌రుగ‌నుంది.. ఈ సినిమా లండ‌న్ లో చిత్రీక‌రించాల‌ని భావిస్తున్నారు చిత్ర యూనిట్.
 
ఇక విదేశాల్లో తొలి షెడ్యూల్ భారీగా ప్లాన్ చేస్తున్నారట‌.. అక్క‌డ నుంచి  త‌ర్వాత హైద‌రాబాద్ లో మ‌రో షెడ్యూల్ ఉండ‌బోతోంది.. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం, ఈ సినిమాలో అఖిల్ కొత్త గెట‌ప్ లో క‌నువిందుచేయ‌నున్నారు.. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్ట‌ర్ చేయ‌నున్నారు అని తెలుస్తోంది... ఈ చిత్రాన్ని బోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇక అమ్మాయిల‌ను వ‌ల‌లో వేసుకుని వారితో రొమాన్స్ చేసే ప్లేబాయ్ గా అఖిల్ ఎలా న‌టిస్తాడో చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.