మిస్టర్ మజ్ను గా మారిపోయిన అఖిల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akkineni akhil
Updated:  2018-08-10 04:28:39

మిస్టర్ మజ్ను గా మారిపోయిన అఖిల్

"అఖిల్" సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తోలి సినిమాతోనే భారీ ఫ్లాప్ ని చవిచుసాడు. ఆ ఫ్లాప్ తరువాత విక్రం కే కుమార్ దర్శకత్వంలో "హలో" సినిమా చేసాడు అఖిల్. ఈ సినిమా డీసెంట్ గా అందరికి నచ్చినా కూడా పెద్ద హిట్ గా నిలవలేదు. అయితే ఇప్పుడు తానూ తీసే మూడో సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అనే కసితో "తొలిప్రేమ" ఫేం అయిన వెంకి అట్లూరితో కలిసి సినిమా చేస్తున్నాడు అఖిల్.

ఇటివలే లండన్ లో ముఖ్య సన్నివేశాల్ని పూర్తి చేసుకొని హైదరబాద్ కి తిరిగి వచ్చారు టీం. అయితే ఈ సినిమాకి "మిస్టర్ మజ్ను" అనే టైటిల్ ని పెట్టాలి అని మూవీ యూనిట్ అనుకుంటున్నారు. సినిమా కథ కి ఇది సరిపోయే టైటిల్ అని డైరెక్టర్ భావిస్తున్నాడు అంట.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో షూటింగ్ ని పూర్తి చేసుకొని డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.