అఖిల్ ని డైరెక్ట్ చెయ్యడు అంట కానీ కథ మాత్రం ఇస్తాడు అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akkineni akhil
Updated:  2018-08-06 05:57:47

అఖిల్ ని డైరెక్ట్ చెయ్యడు అంట కానీ కథ మాత్రం ఇస్తాడు అంట

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన మూడో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. "తొలిప్రేమ" ఫేం అయిన వెంకయ్ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇటివలే లండన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత అఖిల్ ఆది పినిశెట్టి అన్న అయిన సత్య ప్రభాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
 
ఈ సినిమా తరువాత సుకుమార్ రైటింగ్స్ లో సుకుమార్ నిర్మిస్తున్న సినిమాలో అఖిల్ నటించనున్నాడు. సుకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమాని "కుమారి 21 ఎఫ్" ఫేం అయిన సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్ట్ చేయనున్నాడు. ఆసలైతే అఖిల్ ని సుకుమార్ డైరెక్ట్ చేయాలి, కానీ సుకుమార్ మహేష్ బాబు ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం మూలాన కథ మాత్రమే అందించి సినిమాని నిర్మిస్తున్నాడు సుకుమార్.
 
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మాణం లో భాగం కానున్నారు అనే టాక్ ఫిలిం నగర్ లో ఉంది. ఇదిలా ఉంటే అఖిల్ కి గట్టి హిట్ అందించాలి అనే తపనతో నాగార్జున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అని అర్ధం అవుతుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.