రెండు గ్రూపులుగా చీలిన అక్కినేని అభిమానులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-28 03:54:14

రెండు గ్రూపులుగా చీలిన అక్కినేని అభిమానులు

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు అక్కినేని నాగేశ్వ‌రావు ... ఆయ‌న‌కు న‌ట‌న మీద ఉన్న ఆస‌క్తితో 1940 లో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి, కోట్లాది అభిమానుల గుండెల్లో స్ధానం సంపాదించుకున్నారు.. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం కుటుంబ బాధ్య‌త‌ల‌ను, అలాగే అభిమానుల‌ను అక్కినేని నాగార్జున కాపాడుకుంటూ వ‌స్తున్నారు...

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఇంత‌కాలం ఒక కుటుంబంగా ఉన్న అక్కినేని అభిమానులు రెండుగా విడిపోయార‌ని తెలుస్తుంది... నాగార్జున త‌న పెద్ద‌కుమారుడు నాగ‌చైత‌న్య ను స్టార్ హిరో చేసేందుకు నాగ్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌కున్నారంటూ నాగ‌చైత‌న్య‌ అభిమానులు లోలోప‌ల మండిప‌డుతున్నారు...

కేవ‌లం అఖిల్ ను మాత్ర‌మే స్టార్ హిరోను చేయ‌డం కోసం ఎక్కువ‌గా నాగార్జున క‌ష్ట‌ప‌డుతున్నారంటున్నారు... ఈ నేప‌థ్యంలో రీసెంట్ గా విడుద‌లైన చిత్రం హ‌లో. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం నాగార్జున చాలా క‌ష్ట‌ప‌డ్డారు... అయితే నాగార్జున కొడుకుల విష‌యంలో వ్య‌త్యాసం చూపుతున్నార‌ని నాగ‌చైత‌న్య అభిమానులు ఒక గ్రూపు, అఖిల్, నాగార్జున అభిమానులు ఒక గ్రూపు గా విడిపోయారు..

దీంతో రెండు గ్రూపులుగా విడిపోయి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.. అక్కినేని అభిమానులు ఇన్ని ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నా..... నాగార్జున స్పందించ‌క పోవ‌డంతో ఈ వివాదం రానున్న రోజుల్లో మ‌రింత ముదిరే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.