ఎన్టీఆర్ చిత్రంలో నాగ‌చైత‌న్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akkineni naga chaithanya
Updated:  2018-06-25 12:13:47

ఎన్టీఆర్ చిత్రంలో నాగ‌చైత‌న్య

సౌత్ నార్త్ ఇప్పుడు ఎక్క‌డ చూసినా బయోపిక్ ల హవా కొన‌సాగుతోంది.. రాజ‌కీయ నాయ‌కులు సినీ ప్ర‌ముఖులు దివికేగిన తార‌ల చిత్రాల‌ను బ‌యోపిక్ ల ద్వారా వార‌సులు, వారి త‌రంలో ఉన్న హీరోలు చేస్తుంటే, క‌మ‌ర్షియ‌ల్ ఎటిమెంట్స్ తో కొత్త త‌రం హీరోల‌తో కూడా బయోపిక్ లు తెర‌కెక్కుతున్నాయి.. మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో ఇటు ఎన్టీఆర్ బ‌యోపిక్ తో పాటు.. దివంత‌గత నేత మాజీ సీఎం వైయ‌స్సార్ బ‌యోపిక్ యాత్ర రెడీ అవుతోంది.. మ‌రో ప‌క్క ఏ ఎన్నార్ బ‌యోపిక్ విష‌యంలో సందిగ్ద‌త‌లో ఉంది నాగ్ ఫ్యామిలీ.
 
ఇటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఏ ఎన్నార్ బ‌యోపిక్ పై కొద్ది రోజుల్లో ప్ర‌క‌టన చేయ‌వ‌చ్చు అని తెలుస్తోంది.. ఇటు మ‌హాన‌టి బ‌యోపిక్ సావిత్రి పేరును మ‌రింత మందికి ఇప్ప‌టి త‌రానికి తెలిసేలా చేసింది... ఇక త‌మిళ‌నాట జ‌య‌ల‌లిత బ‌యోపిక్ పై ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. అవ‌కాశం ఎవ‌రికో చూడాలి.. ఇటు క‌న్న‌డ‌లో కూడా ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల బ‌యోపిక్ ల‌కు క‌థ‌లు సిద్దం అవుతున్నాయి..
 
ఇప్పుడు ముఖ్యంగా టాలీవుడ్ లోఓ వార్త వైర‌ల్ అవుతోంది.. అక్కినేని నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య మ‌హాన‌టి సినిమాతో ఏఎన్నార్ గెట‌ప్ లో ద‌సరా బుల్లోడుని మైమ‌రిపించాడు.. తాత న‌ట‌న‌తో ఆయ‌న పాత్ర‌ల‌తో మురిపించాడు...అయితే ఆయ‌న తాత గెట‌ప్ లో బాగా సూట్ అయ్యాడ‌ని, అందుకే చైతుతో మ‌రో కొత్త ప్రాజెక్ట్ వారు కూడా మ‌ళ్లీ ఏ ఎన్నార్ పాత్ర‌కు ఆయ‌న్ని ప‌రిశిలీస్తున్నార‌ట‌....ఆ సినిమా ఎవ‌రిదో కాదు సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్..
 
ఆ చిత్రంలో ఏ ఎన్నార్ సీన్స్ లేక‌పోతే క‌ష్టం.. అందుకే ఆయ‌న పాత్ర‌కు చైతూని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది...పైగా మ‌హాన‌టిలో త‌న న‌ట‌న‌తో మ‌రింత అల‌రించాడు చైతూ..ఇప్ప‌టికే నాగ్ తో చ‌ర్చించేందుకు సిద్దం అయ్యార‌ట‌.. మ‌రి ఇంత ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో చైతూ చేస్తాడా..? త‌న కొత్త ప్రాజెక్ట్ ల వ‌ల్ల డేట్స్ పై ఎటువంటి స‌మాధానం ఇస్తాడా అనే ఆలోచ‌న కూడా ఉంది..చూడాలి చైతూ డెసిష‌న్ ఎలా ఉండ‌బోతోందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.