వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగచైతన్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chaithanya
Updated:  2018-07-21 10:39:38

వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగచైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందు మొన్దేటి దర్శకత్వంలో "సవ్యసాచి" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో ఉన్న ఈ సినిమా ఆగష్టు లో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ తో పాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న "శైలజ రెడ్డి అల్లుడు" సినిమాతో కూడా నాగ చైతన్య బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా కూడా ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. ఇటివలే తన మామ వెంకటేష్ తో కలిసి "వెంకీ మామ" అనే సినిమా స్టార్ట్ చేసాడు. ఈ సినిమాని బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు ఇంకా ధియేటర్స్ లోకి రాకముందే శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

సమంతా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా జంటగా వీరు ఈ సినిమా తో నాల్గవ సారిగా నటించబోతున్నారు. కానీ, పెళ్లి అయిన తరువాత వీరిద్దరూ మొదటి సారిగా స్క్రీన్ పైన జంటగాఈ సినిమా లో నటించబోతున్నారు వీళ్ళు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని జులై 23 న లాంచ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. హిందీ టీవీ హీరోయిన్ దివ్యానుష కౌశిక్ ఈ సినిమా లో ముఖ్య పాత్రలో కనిపించనుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.