నాగార్జున దృష్టిలో "భరత్ అనే నేను" సినిమా ఫ్లాప్ హ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu and nagarjuna
Updated:  2018-08-10 12:48:29

నాగార్జున దృష్టిలో "భరత్ అనే నేను" సినిమా ఫ్లాప్ హ?

ఇటివలే అడివి శేష్ హీరోగా నటించిన "గూఢచారి " సినిమా సక్సెస్ కి వచ్చాడు కింగ్ నాగార్జున, అయితే ఈ స్టేజి మీద నాగార్జున కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ ఏడాది హిట్ అయిన చిత్రాల్లో "రంగస్థలం" "మహానటి" మాత్రమే ఉన్నాయని ఆ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు "గూఢచారి" మాత్రమే హిట్ సినిమాలు అని అన్నాడు.
 
ఈ క్రమంలో "భరత్ అనే నేను" లనాటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాని పూర్తిగా మర్చిపోవడమే కాకుండా అవమానించాడు కింగ్ నాగార్జున. "రంగస్థలం" ఇంకా "మహానటి" హిట్ సినిమాలే అలాగే "భరత్ అనే నేను" కూడా హిట్ సినిమాల జాబితాలోకే వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఎంతో మంది రాజకీయ నేతలు ఈ సినిమాని చూసి మరి మహేష్ బాబుని పొగిడారు.
 
అలాంటి సినిమాని నాగార్జున మర్చిపోవడం అనే నిజంగా బాధాకరమైన విషయమే అని కొంత మంది ఫిలిం నగర్ వాసులు అంటున్నారు. ఇదే కాదు కేవలం 2 కోట్లతో రూపొందిన "ఆర్ ఎక్స్ 100" హిట్ ని అలాగే "ఛలో" ఇంకా "తొలిప్రేమ" హిట్ ని కూడా మర్చిపోయాడు నాగార్జున.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.