ఐ మిస్ యు అన్నా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

harikrishna and nagarjuna
Updated:  2018-08-29 12:14:14

ఐ మిస్ యు అన్నా

హీరో నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త విన‌గానే తెలుగు చిత్ర పరిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో అక్కినేని నాగార్జున, హ‌రికృష్ణ‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ట్వ‌ట్ట‌ర్‌ ద్వారా పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం త‌న‌కు హ‌రికృష్ణ అన్న ఫోన్ చేసి మాట్లాడార‌ని చాలాకాలం అయింది త‌మ్ముడు నిన్ను చూసి క‌ల‌వాలి త‌మ్ముడు అని అన్నార‌ని నాగ్ ట్వీట్ట‌ర్ ద్వారా స్పందించారు. 
 
అయితే ఈ రోజు ఉద‌యాన్నే ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే తాను ఒంట‌రి వాన్ని అయిపోయిన‌ట్లు అనిపించింద‌ని ఆయ‌న తెలిపారు. కొద్ది రోజుల క్రితం హ‌రికృష్ణ అన్న మాట‌ల‌ను గుర్తు చేసుకుని ఐ మిస్ యూ అన్నా అంటూ ట్వీట్ చేశారు నాగార్జున‌.
 
చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు..that’s what he said a few weeks ago and now he is gone.all I feel is a void,I will miss you Anna!!!!
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.