మీటూ లో భాగంగా నోరు విప్పిన అలియా బట్ తల్లి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

aliya bhatt
Updated:  2018-10-25 11:54:25

మీటూ లో భాగంగా నోరు విప్పిన అలియా బట్ తల్లి

బాలీవుడ్ లో మీటూ పెద్ద దూమరామే రేపుతోంది.బాలీవుడ్ నటి తనూశ్రీ ప్రముఖ నటుడు నానాపటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఆరోపణ తో భారతీయ చిత్ర పరిశ్రమలో మీటూ ఉధృతం అయ్యింది. సినీ పరిశ్రమలో పనిచేసే నటీమణులు అంతా కూడా తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెడుతున్నారు.

కేవలం సినీ రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు కూడా తమపై జరిగిన ఘటనలను  మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ తల్లి సోని రజ్దాన్ కూడా తనపై జరిగిన లైంగిక దాడులను మీటూలో భాగంగా వ్యక్తికరించారు.తాజాగా మీడియాతో ముచ్చటించిన సినీనటి - బుల్లితెర నటి సోని రజ్దాన్ గతంలో తనకు ఎదరైన చేదు అనుభవాలను పంచుకున్నారు.ఒక సినిమా సందర్భంలో సదరు సినిమాకు పనిచేసే వ్యక్తి తనపై అత్యాచారం చేయాబోయాడని. అప్పుడు తాను చాలా తెలివిగా తప్పించుకున్నాను. అదృష్టవశాత్తు ఆరోజు బయట పడగలిగాను అంటూ చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తి కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందనే ఆలోచనతో ఎవరికి చెప్పలేదు-ఆ తర్వాత సదరు వ్యక్తి చాలాసార్లు కలిశాడు కానీ నేను మాత్రం అతడితో మాట్లాడలేదు అంటూ సోనీ రజ్దాన్ చెప్పారు. సోనీ రజ్దాన్ వ్యాఖ్యలతో మరే సీనియర్ హీరోయిన్ అయినా మీ టూ లో ఓపెన్ అవుతుందో చూడాలి. సీనియర్ హీరోయిన్లు కూడా ఇవి మొదలు పెడితే మీ టూ ఉద్యమం మరోస్థాయి కి చేరుకుంటుంది అంటున్నారు సినీ వర్గాల వారు.

షేర్ :

Comments

0 Comment