2012 లో నాన్న ఆ సినిమా ప్లాన్ చేశారు న‌రేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allari naresh
Updated:  2018-06-22 12:25:54

2012 లో నాన్న ఆ సినిమా ప్లాన్ చేశారు న‌రేష్

జంధ్యాల కామెడీ చిత్రాలు అంటే ఇప్ప‌టికీ ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు.. అలాగే త‌ర్వాత ఈవీవీ కామెడీ చిత్రాల‌కు న‌వ్వుల రారాజు అనే పేరును సంపాదించారు ద‌ర్శకుల్లో..ఆయ‌న 50 సినిమాల‌కు పైగా చేశారు. చాలా వ‌ర‌కూ హాస్య‌పూరిత పాత్ర‌లే, ఎంద‌రో క‌మెడియ‌న్ల‌ను ప‌రిచ‌యం చేసిన ఘ‌నాపాటి ఆయ‌న‌.. టాలీవుడ్ లో ఎంద‌రిని ప‌రిచ‌యం చేశాడు ఆయ‌న, అలాగే స్టార్ల‌తో క‌లిసి ప‌నిచేశారు ద‌ర్శ‌కుడు ఈవీవీ... ఆయ‌న 54 ఏళ్ల‌కే గుండెపోటుతో హ‌ఠాత్తుగా మ‌ర‌ణించారు... చివ‌రి రోజుల్లో ఆయ‌న చిన్న చిన్న సినిమాలు తీసి మంచి హిట్ టాక్ పొందారు...బ‌హుశా ఆయ‌న ఉండి ఉంటే మ‌రిన్ని కామెడీ చిత్రాల‌ను అందించేవారు అని అంటుంటారు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో వారు అంద‌రూ.
 
అయితే ఆయ‌న చివ‌రి రోజుల్లో ఓ సినిమా చేయాల‌ని అనుకున్నార‌ట.. ఆ సినిమా క‌థ గురించి కూడా ఆయ‌న చిన్న కుమారుడు హీరో అల్ల‌రి న‌రేష్ తో చ‌ర్చించార‌ట‌...ఆ సినిమా పేరు కొంప కొల్లేరు అని ప్ర‌క‌టించారు నరేష్ ..2012 లో యుగాంతం గురించి పుకార్లు వ‌చ్చిన స‌మ‌యంలో ఈ క‌థ‌ను తయారు చేశార‌ట‌.. స‌టైరిక్ గా ఈ క‌థ‌ను ఆయ‌న ర‌చించారు అని తెలుస్తోంది... యుగాంతానికి ముందు నెల‌లో ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని భావించార‌ట.. ఇదే విష‌యం న‌రేష్ తో ఆయ‌న ప‌లుసార్లు చ‌ర్చించార‌ని తెలుస్తోంది.
 
మొత్తానికి ఆయ‌న ఉండి ఉంటే ప‌లు కొత్త ర‌కాల క‌థ‌లు సినిమాలుగా వ‌చ్చేవ‌ని.. ఆయ‌న మ‌ర‌ణంతో అనుకున్న క‌థ‌లు అన్నీ ప‌క్క‌కు వెళ్లిపోయాయ‌ని అన్నారు.. ఇప్పుడు ఆయ‌న రాసిని క‌థ‌లు కొన్ని పాత‌బ‌డిపోయామ‌ని అన్నారు..అయితే ఆ క‌థ‌ల‌లో కొన్నింటిని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల కోసం ఈవీవీ వార‌సులు చూస్తున్నారు అని కూడా టాలీవుడ్ లో వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.