మ‌హేష్ బాబును అర‌వింద్ అందుకే క‌లిశారా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-06-29 10:52:22

మ‌హేష్ బాబును అర‌వింద్ అందుకే క‌లిశారా ?

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఏ సినిమాలు చేసినా భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తారు.. ఇటు వైజ‌యంతి మూవీస్ ఎలా పెద్ద సంస్ద‌గా ఉందో, ఇటు గీతాఆర్ట్స్ కూడా ప‌లు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేయ‌డంతో   టాలీవుడ్ లో పెద్ద ఫేమ్ తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు మెగా ప్రొడ్యుస‌ర్ అల్లు అర‌వింద్ ఓ పెద్ద సినిమా నిర్మాణానికి పూనుకున్నారు అనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది.
 
ఇంతకీ ఆ సినిమా ఏమిటి అని అనుకుంటున్నారా..అల్లు అర‌వింద్ ఇప్పుడు ప్రిన్స్ మ‌హేష్ బాబుతో సినిమా చేయాలని భావిస్తున్నారు..మ‌హేష్ సినిమాలు అంటేనే పెద్ద బ‌డ్జెట్ సినిమాలు ఇప్పుడు ఏకంగా ఇద్ద‌రు ముగ్గురునిర్మాత‌లు కూడా క‌లిసి మ‌హేష్ సినిమాకు రెడీ అవుతున్నారు.. ఈ స‌మ‌యంలో అల్లు అర‌వింద్ నిర్ణ‌యం టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.
 
అయితే ఈ సినిమాని ఆయ‌న ఒక్క‌రే నిర్మిస్తున్నార‌ట‌.. ఈ సినిమా చేయ‌డానికి ముందు మ‌హేష్ అభిప్రాయం తెలుసుకోవాలి అని మ‌హేష్ ని క‌లిశార‌ట అల్లు అర‌వింద్ ..క‌చ్చితంగా చేస్తాను అని చెప్పార‌ట, అయితే బ్యాగ్రౌండ్లో అర‌వింద్ ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడితో క‌థ వ‌ర్క్ చేయిస్తున్నార‌ట‌.. ఈ సినిమా భారీ స్దాయిలో నిర్మిస్తారు అని తెలుస్తోంది.
 
మొత్తానికి ద‌ర్శ‌కుడి పేరు మాత్రం ఇప్పుడు బ‌యట‌కు రాక‌పోయినా, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాక్ అయితే న‌డుస్తోంది.. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ తో సినిమా చేయ‌ని ఓ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తార‌ట‌.. ఇక ఎక్కువ భాగం మెగా ఫ్యామిలీల‌తోనే సినిమాలు చేస్తారు అనే విమ‌ర్శ నుంచి త్వ‌ర‌లో అర‌వింద్ స‌రికొత్త ఒర‌వ‌డితో మ‌హేష్ చిత్రంతో ముందుకు రానున్నారు అని ఇటు టాలీవుడ్ చ‌ర్చించుకుంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.