ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలి అని డిసైడ్ అయిన అల్లు అరవింద్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu aravind
Updated:  2018-08-16 03:15:21

ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలి అని డిసైడ్ అయిన అల్లు అరవింద్ ?

తెలుగు ఇండస్ట్రీ లో ఎప్పటి నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతున్నాడు అల్లు అరవింద్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేసాడు అల్లు అరవింద. అలాంటి అల్లు అరవింద్ స్వయంగా తానూ పరిశ్రమలో ఉండాలని అనుకోవడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
 
అల్లు అరవింద్ ఈ నిర్ణయానికి కారణం "గీత గోవిందం" సినిమా వీడియో లీక్ అంట. రిలీజ్ కి ముందే ఈ సినిమాకి సంభందించిన కొన్ని వీడియోస్ ఇంటర్నెట్ లో హలచల్ చేసాయి. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సినిమాకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
 
ఈ టైం లోనే అల్లు అరవింద్ ఇండస్ట్రీ లో జరిగే పరిమాణాల పట్ల అసహనం వ్యక్తం చేసారు అంట. అదే సమయం లో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలి అని తానూ డిసైడ్ అయినట్టు కూడా చెప్పాడు. ఫ్యూచర్ లో ఇలాంటివి గాని మళ్ళి జరిగితే తానూ సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తాను అనేట్టుగా అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.