బన్నీ ఇంకా ఏ ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు..అల్లు అర‌వింద్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun and allu aravind
Updated:  2018-08-16 12:31:00

బన్నీ ఇంకా ఏ ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు..అల్లు అర‌వింద్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” అనే సినిమా తో ఫ్లాప్ ని చవి చూసాడు. అయితే ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంకా ఏ ఒక్క సినిమా కూడా స్టార్ట్ చేయలేదు. అయితే అల్లు అర్జున్ ఆ కథ ఓకే చేస్తున్నాడు, ఈ డైరెక్టర్ తో మూవీ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ ఫిలిం నగర్ లో హలచల్ చేస్తుంది.

అయితే అల్లు అర్జున్ మాత్రం ఇంకా ఏ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు అంట. ఈ విషయాన్నీ స్వయానా అల్లు అరవింద్ ప్రకటించాడు. ఆయన అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ “ బన్నీ ఇంకా ఏ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. కానీ విక్రం కే కుమార్ స్క్రిప్ట్ ని మాత్రం ఓకే చేసే పనిలో ఉన్నాడు.

దానికి ఇంకా ఒక నెల సమయం పట్టొచ్చు. అదే విధంగా సురేందర్ రెడ్డి ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయి” అని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.

షేర్ :