కెరీర్ లో తొలిసారి అలాంటి కథలో నటిస్తున్న అల్లు అర్జున్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun
Updated:  2018-08-23 10:58:45

కెరీర్ లో తొలిసారి అలాంటి కథలో నటిస్తున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం ఒక భారీ హిట్ అవసరం. అందుకే తన తదుపరి సినిమాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా ని పునర్జన్మల నేపధ్యంలో తెరకేకిస్తున్నాడు అంట విక్రం కే కుమార్. అయితే పునర్జన్మల నేపథ్యంలో తెలుగులో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
 
అందులో మొదట చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ హీరోగా నటించిన "మగధీర" సినిమా గురించి. ఈ సినిమా రామ్ చరణ్ ని ఒక రేంజ్ లోకి తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ ని ఫాలో అవుతూ పునర్జన్మ నేపధ్యంలో ఈ సినిమా చేస్తున్నాడు అని టాక్. వరుసగా రెండు చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు దాంతో సూపర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు అల్లు అర్జున్.
 
ఇక విక్రమ్ కే కుమార్ కూడా "మనం" తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టలేదు దాంతో అతడు కూడా కసిగానే ఉన్నాడు. పునర్జన్మల నేపథ్యం లో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలుస్తోంది అయితే వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.