డ్యూయల్ రోల్ లో అదరగోట్టబోతున్న బన్నీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero allu arjun
Updated:  2018-07-18 12:45:09

డ్యూయల్ రోల్ లో అదరగోట్టబోతున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం విక్రం కె కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ కోసం పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ ని రెడీ చేసాడు విక్రం కె కుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటించనున్నాడు అంట. ఈ సినిమా కోసం హై క్లాస్ టెక్నీషియన్స్ ని తీసుకునే పనిలో విక్రం కె కుమార్ ఉన్నాడు.

అలాగే ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏ.ఆర్ రహమాన్ ని అనుకున్నాడు అంట విక్రం. వీళ్ళిద్దరూ ఇది వరకు "24" అనే సినిమాకు కలిసి పని చేసారు. తెలుగు లో "సై రా" సినిమాకి పనిచేయాల్సిన రహమాన్ కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.

మళ్ళి ఆ సినిమా తరువాత ఇదే సినిమాని ఒప్పుకున్నాడు రహమాన్. అల్లు అర్జున్ గత సినిమా అయిన "నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా" కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన విశాల శేఖర్ సంగీతం అందించారు. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.