చిరంజీవితో కలిసి నటించనున్న అల్లు అర్జున్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi and allu arjun
Updated:  2018-08-09 03:05:02

చిరంజీవితో కలిసి నటించనున్న అల్లు అర్జున్

మెగాస్టార్ చిరంజీవి "ఖైది నెంబర్ 150" తరువాత నటిస్తున్న సినిమా "సై రా నరసింహ రెడ్డి". ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండగా ఇప్పటికే నిహారిక ఓ గిరిజన యువతి గా నటించనున్నట్లు ప్రకటించగా అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
 
మెగా స్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ని ఏరి కోరి మరి ఆ పాత్ర కోసం పెట్టించుకున్నాడు అని తెలుస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ బాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టించగా తాజాగా మరికొంతమంది స్టార్స్ యాడ్ అవుతుండటంతో హాట్ కేక్ కానుంది. ఇదిలా ఉంటే ఇంకా ఈ న్యూస్ కి సంభందించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా మరో హీరోయిన్ గా నటిస్తుంది వీళ్ళతో పాటు స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, నిహారిక లతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.