మరో భారీ ప్లాప్ నుండి తప్పించుకున్న అల్లు అర్జున్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun
Updated:  2018-10-06 12:04:14

మరో భారీ ప్లాప్ నుండి తప్పించుకున్న అల్లు అర్జున్ ?

అల్లు అర్జున్ కి మన తెలుగు తో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఏకంగా మలయాళీలు అయితే అల్లు ని, మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు..ఈ క్రేజ్ వల్ల సరైనోడు సినిమా సమయం నుండి కూడా తమిళ ప్రొడ్యూసర్లు అల్లు మీద ఓ కన్నేశారు.. అయితే ఆ మధ్య లింగుస్వామి తో సినిమా చెయ్యాల్సి ఉండగా, ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాలేదు. ఇది ఇలా ఉండగా మొదట జ్ఞానవేల్ రాజా నోటా సినిమా ని అల్లు అర్జున్ తో చెయ్యలనుకున్నాడట.

నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా షూటింగ్ సమయంలో అల్లు ని కలిసిన ఆనంద్ శంకర్ ఈ కథ కూడా వినిపించడంట. అయితే ఆ పాత్ర తనకి సూట్ కాదు అనుకోవడం తో రిజెక్ట్ చేసాడట.పొరపాటున అల్లు అర్జున్ కనుక ఈ సినిమా ఒప్పుకోని ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో, నిన్న నోటా టాక్ చూస్తుంటే అర్థం అవుద్దీ. అసలే నా పేరు సూర్యతో ప్లాప్ మూట గట్టుకోని, డీలా పడిన అల్లు అర్జున్ కి మరో పెద్ద ప్లాప్ వచ్చేది..

అల్లు అర్జున్ ఒప్పుకోకపోవడం తో ఆ కథ విజయ్ దేవరకొండ ని చేరింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా కావడంతో విజయ్ ఈ కథని దైర్యంగా ఒప్పుకున్నాడు.. నా పేరు సూర్య తరువాత కథలు వినడంలో బిజీగా గడుపితున్నాడు అల్లు అర్జున్, అప్పటినుండి ఒక సినిమా కూడా సైన్ చెయ్యలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ చూపు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఉంది. తన కెరీర్ లో రెండు హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు హ్యాట్రిక్ హిట్టు ఇస్తాడనే ఆశతో ఎదురుచూస్తున్నాడు.. అయితే త్రివిక్రమ్ కూడా ఒకపక్క అజ్ఞతవాసి ప్లాప్ తో ఇబ్బంది పడ్డా, ఇప్పుడు తారక్ తో అరవింద సమేత చిత్రాన్ని పూర్తి చేశాడు.. ఈ సినిమా హిట్టు, ప్లాప్ ని బట్టి కూడా అల్లు-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.