అలాంటి సినిమాలు బన్నీ అస్సలు చెయ్యడు అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun
Updated:  2018-08-17 05:09:34

అలాంటి సినిమాలు బన్నీ అస్సలు చెయ్యడు అంట

స్టైలిష్ స్టార్ అయిన బన్నీ ప్రస్తుతం విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ సినిమాకి సంభందించిన ఒక్క అధికారిక ప్రకటన్ కూడా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఈ గ్యాప్ లో దిల్ రాజు అల్లు అర్జున్ దగ్గరకి "సభకు నమస్కారం" అనే స్క్రిప్ట్ ని పంపించాడు అంట.

అసలైతే ఈ స్క్రిప్ట్ ని నాని చేయాలి, నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేసాడు. ఎలాగో బన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు కాబట్టి దిల్ రాజు ఈ కథని అల్లు అర్జున్ కి వినిపించాడు. పూర్తి పొలిటికల్ డ్రామాగా ఉండే ఈ స్క్రిప్ట్ ని అల్లు అర్జున్ రిజెక్ట్ చేసాడు అంట. రిజెక్ట్ చేయడమే కాకుండా రాజకీయ నేపధ్యంలో ఉండే సినిమాలు అస్సలు చెయ్యను అని కూడా దిల్ రాజు కి చెప్పినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజు ఈ కథని ఏ హీరోకి చెప్దాం అనే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన "శ్రీనివాస కళ్యాణం" సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచినా విషయం అందరికి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.