పవన్ కు మద్దతు ఇస్తున్న అల్లు ఫ్యామిలీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-10-16 01:14:05

పవన్ కు మద్దతు ఇస్తున్న అల్లు ఫ్యామిలీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు వచ్చాయని బోలెడు వార్తలు విన్నాం. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన కామెంట్ వల్ల పవన్ ఫ్యాన్స్ బాగా ఫైర్ అయ్యారు. అయితే, అన్నీ కొన్నాళ్ళు మాత్రమే. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రోగ్రామ్ కు పవన్ హాజరయ్యారు, అలానే ఫిల్మ్ చాంబర్ దగ్గర పవన్ కు బాసటగా బన్నీ కనిపించడంతో రూమర్లు కాస్తా పటాపంచలు అయ్యాయి. ప్రస్తుతం జనసేన అధినేతగా మారిన పవన్ వెన్నంటే మెగా ఫ్యామిలీతోపాటు అల్లు ఫ్యామిలీ కూడా రానుంది. 
 
తాజాగా రాజమండ్రిలో జనసేనాని తలపెట్టిన కవాతు వెనుక అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన నిర్మాత బన్నీ వాసు ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే రాజమండ్రి బ్రిడ్జి పై జగన్ యాత్ర జరిగింది. ఇప్పుడు మళ్ళీ గోదావరి వంతెన పై భారీస్థాయిలో జనసమీకరణకై జనసేనాని పవన్ సంకల్పించారు.
 
ఇక ఆ కవాతుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ బన్నీ వాసు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాక గోదావరి జిల్లాల్లో పవన్ కు ఈ కవాతు చాలా ముఖ్యం కావడంతో దానిని మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. ఇప్పటినుండి దాదాపు అన్నీ జనసేన కార్యక్రమాల్లో బన్నీవాసు పాలు పంచుకోనున్నట్టు తెలుస్తోంది.

షేర్ :